పవన్‌ సీఎం కావాలి:కాంగ్రెస్‌ నేత బండ్ల

417
pawan bandla
- Advertisement -

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పొలిటికల్ ముఖచిత్రం నుండి తప్పుకున్న కాంగ్రెస్ నేత,సినీ నిర్మాత బండ్ల గణేష్ మళ్లీ వార్తల్లోకెక్కారు. ఈసారి తన దైవం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు దారితీసింది.

నిజాయితీ కి నిలువుటద్దం, మానవత్వానికి ప్రతిరూపం, మంచితనానికి మరో పేరు. నా దైవం, నా బాస్. పవన్ కల్యాణ్ గారిని ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా చూడాలని నా ప్రగాఢమైన కోరిక అని ట్వీట్ చేశారు బండ్ల. నా ఆశ, నా కోరిక నిజం చేయాలని ఏపీ ప్రజలకు హృదయపూర్వక విజ్ఞప్తి అంటూ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన బండ్ల షాద్ నగర్ సీటు ఆశీంచారు. కానీ ఆయనకు నిరాశే ఎదురైంది. అయితే పార్టీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ బండ్లను కూల్ చేసింది. పార్టీ అధికార ప్రతినిధిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారం లో కి రాకపోతే పీక కోసుకుంటాను అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఎన్నిక రిజల్ట్స్ తర్వాత మాటమార్చిన బండ్ల పాలిటిక్స్‌లో ఇలాంటివి సాధ్యమేనని పేర్కొన్నారు.తిరిగి తాజాగా లైమ్ లైట్‌లోకి వచ్చిన ఆయన పవన్‌ సీఎం కావాలంటూ చేసిన ట్వీట్ కాంగ్రెస్‌ను ఇరకాటంలో నెట్టేయగా పవన్‌ ఫ్యాన్స్ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -