టీచర్ గా మారిన నటి మంచు లక్ష్మీ

356
manchu Laxmi
- Advertisement -

ప్రపంచంలో సుప్రసిద్ద సంస్ధలకు వినియోగదారులతో అనుసంధానించబడేందుకు సాధికారిత కల్పిస్తున్న సాఫ్ వేర్ కంపెనీ పెగా సిస్టమ్స్,, ఐఎన్సీ మరియు ప్రాధమిక, ఉన్నత పాఠశాల విద్యార్దులకు ఆంగ్ల భాష విద్యలో శిక్షణ అందించడంతో పాటుగా నాయకత్వ నైపుణ్యం, డిజిటల్ అక్షరాస్యత లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్ద టీచ్ ఫర్ చేంజ్. సుప్రసిద్ద నటి , నిర్మాత, టీచ్ ఫర్ ఛేంజ్ ట్రస్ట్ చైర్ పర్సన్ లక్ష్మీ మంచు ఒక రోజు పాటు ఆంగ్ల భాషా ఉపాధ్యాయురాలిగా సేవలందించేందుకు ఆహ్వానించింది. మాదాపూర్ లోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ఐదవ తరగతి విద్యార్దులకు ఆంగ్ల భాషను లక్ష్మీ బోధించడంతో పాటుగా నూతన విద్యా సంవత్సరంలో పెగా టీచ్ ఫర్ చేంజ్ అక్షరాస్యత కార్యక్రమం కోసం వాలెంటర్ అప్లికేషన్ లను ఆహ్వానించారు.

manchu

దేశవ్యాప్త ఉద్యమం పెగా టీచ్ ఫర్ చేంజ్ అక్షరాస్యత కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహితంగా పనిచేయడంతో పాటుగా ప్రాధమిక పాఠశాలల విద్యార్దుల నడుమ అక్ష్యరాస్యత నైపుణ్యం అభివృద్ది చేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నిబద్దత కలిగిన వ్యక్తులు తమ కమ్యూనిటీలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్దులకు బోధన చేయనున్నారు. ఈ వాలెంటీర్లను తమ చుట్టు పక్కల ప్రాంతాలలో నియమించేముందు వారిని పరీక్షించడంతో పాటుగా శిక్షణ కూడా అందిస్తారు.

- Advertisement -