ప్రియదర్శి బైక్ దొంగతనం..

307
Actor Priyadarshi
- Advertisement -

పెళ్లి చూపులు సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు ప్రియదర్శి. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో అతనికి చాలానే ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం ప్రియదర్శి పెద్ద హీరోల సరసన కూడా నటిస్తున్నాడు. దర్శి హీరోగా ఇటివలే మల్లేశం అని సినిమాను చేశాడు.

ఈసినిమా కూడా విజయం సాధించింది. చేనేత కళాకారుల జీవితాలపై తెరకెక్కిన ఈసినిమా భారీ కలెక్షన్లను రాబట్టింది. అయితే కొద్ది రోజుల కిందటే దర్శి తన కిష్టమైన ఓ బైక్ ను కొనగోలు చేశాడు. తన ఇంటి ముందు పార్క్ చేసిన ఆ బైక్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. ఈ విషయాన్ని దర్శి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

నా బైక్ దొంగిలిస్తున్న వీడియో ఫుటేజ్ ఇది..కనీసం ఈ దొంగ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోలేదు. అన్ ప్రొఫెషనల్ థీఫ్ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ వీడియో పెట్టిన కొద్ది సేపటి తర్వాత డిలిట్ చేశారు.

- Advertisement -