‘మా’ ఎన్నికల్లో మరో వివాదం.. జీవితపై పృథ్వీ కామెంట్స్‌..

25

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈసారి మా ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికవబోతున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా వివాదాలు తెరమీదకు వచ్చాయి. తాజాగా మరో వివాదం ఏర్పడింది. జీవితపై చర్యలు తీసుకోవాలంటూ నటుడు పృథ్వీరాజ్ ఎన్నికల అధికారికి లేఖ రాయడం కలకలం రేపింది.

మా సభ్యులను జీవిత మభ్యపెడుతున్నారంటూ పృథ్వీ తన లేఖలో ఆరోపించారు. తనకు ఓట్లేస్తేనే ప్రయోజనాలు ఉంటాయని జీవిత చెబుతున్నారని పేర్కొన్నారు. జీవిత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఆమెపై క్రమశిక్షణ కమిటీ ద్వారా చర్యలు తీసుకోవాలని కోరారు.

కాగా, జీవిత మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ప్రధాన కార్యదర్శి పదవి కోసం పోటీ చేస్తుండగా, మంచు విష్ణు ప్యానెల్లో ఉన్న పృథ్వీరాజ్ మా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. అక్టోబరు 10న మా ఎన్నికల పోలింగ్ జరగనుండగా, మంచు విష్ణు ఇవాళ తన ప్యానెల్ ను ప్రకటించడం తెలిసిందే. ఇక అక్టోబర్ 10న టాలీవుడ్‌లో అట్టహాసంగా ఈ ఎన్నికల పోలింగ్ జరగనున్నది.