ఓయూలో జమ్మి మొక్కను నాటిన ఎమ్మెల్యే గాదరి కిశోర్..

24

ప్రతి దేవాలయంలో జమ్మి చెట్టు ఉండాలని సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపును ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీష్ ఆధ్వర్యంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సమీప ప్రాంతంలోని సరస్వతి గుడి ప్రాంగణంలో జమ్మి చెట్టు నాటడం కోసం ముఖ్యఅతిథిగా తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన టిఆర్ఎస్ పార్టీ యువజన, విద్యార్థి రాష్ట్ర నాయకులతో కలిసి ‘జమ్మి చెట్టు’ మొక్కను నాటారు.

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు పల్లా ప్రవీణ్ రెడ్డి, వల్ల ల మల్ల కృష్ణ వీరబాబు,మంద సురేష్,టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకులు గుండగాని కిరణ్ గౌడ్,కోతి విజయ్,గదరాజు చందు,జిల్లా నాగయ్య, శ్రీకాంత్ గౌడ్, మేకల రవి , శోభన్ బాబు, వెంకట్,నవీన్ గౌడ్, ప్రశాంత్ కర్ణాకర్ ,రాజు, సుధీర్, వెంకట్, , రేణు, అవినాష్ ,శంకర్ ,ప్రసాద్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.