మీర్ పేటలో మంత్రి ఎర్రబెల్లి విస్తృత ప్రచారం

21
errabelli

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా మీర్ పేట డివిజన్‌లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం విస్తృత ప్రచారం నిర్వహించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మీర్ పేట్ హౌసింగ్ బోర్డ్‌ ఆయా కాలనీల్లో ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులతో సమన్వయ సమావేశాలు నిర్వహించారు. పార్టీ అధిష్ఠానం టికెట్ ఇచ్చిన అభ్యర్థిని గెలిపించే విధంగా పని చేయాలని సూచించారు.

బస్తీల్లో చాయ హోటల్స్ వద్ద జనంతో కలిసి టీతాగారు. రోడ్ల పక్క న ఇస్త్రీ చేసుకునే, చిరు వ్యాపారులు, రోడ్డున వెళుతున్న ప్రయాణికులు, మహిళ లతో కలిసి టీఆర్ఎస్ పార్టీ కి ఓట్లు వేయాలని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థులను అఖండ మెజారిటీ తో గెలిపించి హైదరాబాద్ అభివృద్ధికి పాటు పడాలన్నారు.