ఆర్ఆర్ఆర్ గ‌ర్జ‌న‌….మేకింగ్ వీడియో

26
rrr

దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది. కొద్ది సేప‌టి క్రితం ఆర్ఆర్ఆర్ మూవీ మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు.

హాలీవుడ్ రేంజ్‌లో జక్క‌న్న స‌న్నివేశాల‌ని చిత్రీక‌రించిన‌ట్టు తెలుస్తుంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌లో ఎన్టీఆర్, రాజ‌మౌళి అద‌రగొట్టారు. ఈ వీడియోని చూస్తుంటే ఆర్ఆర్ఆర్ టీం అభిమానుల‌కి ప‌సందైన వినోదం అందించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అజ‌య్ దేవ‌గ‌ణ్ ముఖ్య పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నారు.

Roar Of RRR - RRR Making | NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt | SS Rajamouli