నటుడు కైకాల సత్యనారాయణకు అస్వ‌స్థ‌త‌..

167
- Advertisement -

సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరారు. నాలుగు రోజుల క్రితం ఆయన ఇంట్లో ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డారని ఆయ‌న కుటుంబ స‌భ్యులు చెప్పారు. నిన్న రాత్రి ఆయ‌న స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చేర్పించామ‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంద‌ని, ఎవ‌రూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా, రెండేళ్ల నుంచి కైకాల స‌త్య నారాయ‌ణ సినిమాల్లో న‌టించ‌ట్లేదు. ఆయన చివరిగా ‘యన్టీఆర్ కథానాయకుడు, మహర్షి’ చిత్రాల్లో తెరమీద కనిపించారు.

- Advertisement -