రాయలసీమ యాసకు పెట్టిందిపేరు…జయప్రకాశ్‌ రెడ్డి

175
jayaprakash
- Advertisement -

సినీ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి ఇకలేరు. గుండెపోటుతో ఇవాళ ఉదయం 7 గంటలకు తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా గుంటూరులో ఉంటున్న జయప్రకాశ్‌ రెడ్డి…గుండెపోటు రావడంతో బాత్రూంలోనే కుప్పకూలిపోయారు. ఆయన మృతితో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది.

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ నటుడు జయప్రకాశ్ రెడ్డి. హాస్యనటుడిగా,విలన్‌గా ఓ వెలుగు వెలిగారు. ముఖ్యంగా రాయలసీమ బాషలో తనదైన శైలీలో విలనిజాన్ని పండించారు జయప్రకాశ్ రెడ్డి. కర్నూల్ జిల్లా సిర్వేల్‌లో అక్టోబర్ 10,1964న జన్మించారు. నెల్లూరులోని పత్తేకాన్‌పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు తర్వాత నెల్లూరులోని రంగనాయకులపేట లోని ఉన్నత పాఠశాలలో చేరారు.

చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆసక్తి కలిగిన జయప్రకాశ్ రెడ్డి 1988లో బ్రహ్మపుత్రుడు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. బాలకృష్ణ హీరోగా నటించిన సమరసింహారెడ్డి సినిమాలో వీరరాఘవరెడ్డి పాత్రతో తిరుగులేని విలన్‌గా పేరుతెచ్చుకున్నారు. చివరగా వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో నటించారు.

ఆయన పేరు చెప్పగానే పలు డైలాగ్‌లు వెంటనే గుర్తుకొస్తాయి…ఎందరబ్బి..? ,వచ్చేదానికంటే పొయ్యేదే ఎక్కువ ఉందేమి రా?,ఒరేయ్ పులీ! ఏమిరా నెత్తికి అట్ల గుడ్డ జుట్టుకున్న్యావ్, బోడెమ్మ లెక్క!,మీ మనసులు దెల్చుకున్న్యాం, మా అలవాట్లని మార్చుకున్న్యాం.,పెళ్ళి నాడు గుడక మాంసం ఏంది రా? ఒక్క దినము గుడక ఉండలేవా?,ఏమి రా నోరు లేచ్చండాదే?,ఆడ ఏం ఉండాయో ఏం లేవో. కంది బ్యాడలు, శెనగ బ్యాడలు, అన్ని ఒక లారీకి ఏసి పంపిజ్జామా? అనే డైలాగ్‌లు ఫేమస్‌.

- Advertisement -