మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అక్టోబర్ 10న జరగనున్న ‘మా’ ఎన్నికలలో అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు ఉన్న విషయం తెలిసిందే. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం తన ప్యానెల్ మేనిఫెస్టో విడుదల చేసి రేసులో ఉన్నానంటూ సంకేతాలు పంపిన నటుడు సీవీఎల్ మధ్యాహ్నానికి మనసు మార్చుకున్నారు. ‘మా’ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
తన నామినేషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ‘మా’ పదవుల కంటే ‘మా’ సభ్యుల సంక్షేమానికే అధిక ప్రాధాన్యత ఇస్తానని ఈ సందర్భంగా సీవీఎల్ పేర్కొన్నారు. నేను ఎవ్వరికి మద్దతు ఇవ్వడం లేదు అని ఆయన తెలిపారు. మా’ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడానికి గల కారణం రెండు రోజుల్లో చెప్తాను అన్నారు.
– 2011లో మనం పాస్ చేసుకున్న రిజల్యూషన్స్‌ని పర్ఫెక్ట్గా అమలు చేయడం..ఇది అమలు అయితే ఆర్టిస్టులందరికి అవకాశాలు వస్తాయి.
– ఈ రిజల్యూషన్ పాస్ చేసినప్పుడే 50మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చెయ్యాలి అనుకున్నాము..వాళ్ల పేర్లు త్వరలో ఎనౌన్స్ చేస్తాను.
– హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ‘మా’ సభ్యుడికి సంవత్సరానికి 3లక్షల రూపాయలు.దీన్ని వచ్చే జనవరి నుంచి అమలు చేస్తాం.
– ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో ‘మా’ మెంబర్‌కి అసోసియేట్ మెంబర్ షిప్ సంపాదించడం.
– పెన్షన్ ప్రస్తుతం 6వేలు ఇస్తున్నారు.. ఈ నవంబర్ నుంచి అది 10వేలు ఇచ్చేలా చేయడం
– ఆడవాళ్ళకు ఉపయోగపడే ఆసరాని 20 ఏళ్లు క్రితం పెట్టాము .. మళ్ళీ రివైవ్ చేయడం
– ఆసరా కమిటీలో వుండే 13 మంది పేర్లను త్వరలోనే ఎనౌన్స్ చేస్తాను.
– ఎవరైనా మా సభ్యుడు ఆకలి భాధలు పడుతుంటే అతను కాల్ చేసినా రెండు గంటలలో అతని ఇంటికి నెల రోజుల సరిపడా గ్రాసరినీ(సరుకులు) పంపిస్తాము