మూడు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన యాక్ష‌న్ హీరో..

291
gopichand
- Advertisement -
యాక్ష‌న్ హీరో గోపిచంద్ కు స‌రైన హిట్ లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఇటివ‌లే వ‌చ్చిన . ‘గౌతమ్ నందా’.. ‘ఆక్సిజెన్’.. ‘ఆరడుగుల బుల్లెట్’.. ‘పంతం సినిమాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌క‌పోవ‌డంతో నిరాశ‌లో ఉన్నారు గోపిచంద్ అభిమానులు. దింతో త‌న త‌ర్వాతి సినిమాకు కాస్త గ్యాప్ తీసుకుని స‌రైన స్టోరీని సెల‌క్ట్ చేసుకునే ప‌నిలో ఉన్నాడు.
gopichand
తాజాగా గోపిచంద్ కు సంబంధించిన ఓ విష‌యం ఫిలీం న‌గ‌ర్ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంది.  గోపీచంద్ ఒకేసారి మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడని తెలుస్తుంది. అందులో ఇద్దరు తెలుగు డైరెక్టర్లు ఒక తమిళ దర్శకుడు ఉండడం విశేషం. ద‌ర్శ‌కుడు సంప‌త్ నందితో ఓ యాక్ష‌న్ మూవీలో న‌టించేందుకు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చాడ‌ని స‌మాచారం. ఇక మ‌రో ద‌ర్శ‌కుడు శ్రీవాస్.
oxygen
గోపిచంద్ తో శ్రీవాస్ ఇప్ప‌టివ‌ర‌కూ రెండు సినిమాలు చేశాడు.  ‘లక్ష్యం’.. ‘లౌక్యం’ రెండూ సినిమాలు మంచి విజ‌యాన్ని సాధించాయి. మూడో అత‌ను త‌మిళ ద‌ర్శ‌కుడు తిరు. ద‌ర్శ‌కుడు తిరు గోపిచంద్ ను స్టోరీ చెప్ప‌డంతో వెంట‌నే గ్రీన్ ఇచ్చాడ‌ని స‌మాచారం. ఈమూడు సినిమాల్లో ఏది ముందు ప్రారంభ‌మౌతుందో ఇంకా క్లారిటీ లేదు. ఈసారైన గోపిచంద్ హిట్ కొడ‌తాడో లేదో చూడాలి మ‌రి.
- Advertisement -