యంతర లోకపు సుందరివే…

221
rajani 2.0
- Advertisement -

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘2.0’ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే ఇండియన్‌ సినిమాలోనే 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నవంబర్‌ 29న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా ‘యంతర లోకపు సుందరివే’ లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. నా ప్రియమో ప్రియమో బ్యాటిరివే.. విడిచి వెలిపోద్దే.. నా ప్రియమో ప్రియమో బ్యాటిరివే.. అసలేం తగ్గొద్దే యంతర లోకపు సుందరివే.. అంతల కవితల సందురివే.. అంటూ చిట్టి రోబో యంత్ర సుందరితో రొమాంటిక్ పాట పాడేస్తున్నారు రజనీ.

అద్భుతమైన గ్రాఫిక్స్‌తో హై టెక్నాలజీ వాల్యూస్‌తో రజినీకాంత్, అమీ జాక్సన్‌లపై ఈ సాంగ్‌ను రూపొందించారు. తమిళ్‌లో ఈ సాంగ్‌ను ఇటీవల విడుదల చేయగా.. తెలుగులో నేడు విడుదల చేశారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

- Advertisement -