ఆచార్య కోసం టెంపుల్‌ టౌన్‌నే నిర్మించాం!

102
acharya
- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఏప్రిల్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆచార్య సినిమాలో వేసిన ధర్మస్థలి సెట్ గురించి చెప్పుకొచ్చారు చిరంజీవి.

సినిమా కోసం ధర్మస్థలి అనే ఊరినే సెట్ వేసి నిర్మించామని…ఇందుకు సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు చిరు. కోకాపేటలో ఒక టెంపుల్ టౌన్ నిర్మించాం.. కొరటాల నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఒక టెంపుల్ టౌన్ కావాలి, పాతకాలం నాటిది. ఒక పక్క కొండలు, మరో పక్క గ్రీనరీ, మరో పక్క పెద్ద నది, ఊరిలా ఉంటుంది అని చెప్పారు. అలా కొన్ని నెలలకి కోకాపేట లోనే టెంపుల్ టౌన్ నిర్మించాం అన్నారు.

20 ఎకరాల్లో ఒక టౌన్ ని అగ్రహారాలు, మండపాలు, గుడి, గాలి గోపురాలు, ఒక పెద్ద విగ్రహం, కొండలు, ఇవన్నీ ఉండేలాగా నిర్మించారు. టోటల్ గా సినిమా చూసేసరికి చాలా థ్రిల్ గా ఫీల్ అయ్యాం అని తెలిపారు చిరు. ఈ సెట్ ఇంత బాగా రావడానికి కారణంఆర్ట్ డైరెక్టర్ సురేష్… దేశం మొత్తం మీద సినిమా కోసం వేసిన సెట్స్ లో ఇంత పెద్దగా 20 ఎకరాల్లో వేసిన ఏకైక సెట్ ఆచార్య సినిమా సెట్ మాత్రమే అన్నారు చిరు.

- Advertisement -