హ్యాపీ బర్త్ డే…సమంత

61
samantha

ఏ మాయ చేశావే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత తక్కువ టైంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దక్షిణాదిలో సమంత స్టార్ హీరోలందరితో నటించింది. అంతే కాదు తనకు మాత్రమే సాధ్యమైన నటన, హావభాలతో లక్షలాది మంది అభిమానులని సొంతం చేసుకుంది.

యంగ్ హీరో నాగచైతన్యని ప్రేమ పెళ్లి చేసుకుని అక్కినేని వారి కోడలిగా అడుగుపెట్టిన సామ్.. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో సామ్ బిజీగా ఉంది. రీమేక్ సినిమాలకు కేరాఫ్‌గా మారిన సమంత తాజాగా కన్నడ రీమేక్ మూవీ దియాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

రంగస్థలం సినిమాలో రామ్ చరణ్‎కి జంటగా రామలక్ష్మి పాత్రలో అద్భుత నటనతో విమర్శుకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. తొలిసారి పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సామ్…తన నటన,అందంతో అగ్రహీరోయిన్‌గా గుర్తింపుతెచ్చుకుంది.

స‌మంత ప్ర‌స్తుతం శాకుంత‌లం అనే పౌరాణిక చిత్రంలో శ‌కుంత‌ల‌గా న‌టిస్తోంది. త‌మిళంలో విజ‌య్ సేతుప‌తితో క‌ల‌సి కాతు వాకుల రెండు కాద‌ల్లోనూ న‌టిస్తోంది. సామ్ ఇలాంటి మరెన్నో హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మరింతగా అలరించాలని greattelangaana.com మనస్పూర్తిగా కోరుకుంటోంది.