టాలీవుడ్ మెగాస్టార్ చిరు తాజాగా నటించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈమూవీని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించానున్నారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటించారు. గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూవస్తున్న ఈమూవీ చివరికి ఏప్రిల్ 29న విడుదల చేయబోతున్నారు.
అయితే, ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో కూడా డబ్ చేసి అదే రోజున విడుదల చేయబోతున్నట్టు పెన్ స్టూడియోస్ సంస్థ తెలిపింది. దేవాదాయ భూములు అన్యాక్రాంతం, నక్సలిజం బ్యాక్ డ్రాప్ వంటి అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు కొరటాల శివ. బాలీవుడ్లో ఆచార్య సినిమా పెద్ద హిట్టయితే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. మరి బాలీవుడ్ ప్రేక్షకులను ఆచార్య ఏమేరకు అకట్టుకుంటాడో చూడాలి.

