విజయ్‌ ACE..రిలీజ్ డేట్!

13
- Advertisement -

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ACE. అరుముగ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. 2025 మే 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

రుక్మిణి వసంత్, యోగి బాబు, బి.ఎస్. అవినాష్, దివ్య పిళ్ళై, బబ్లూ, రాజ్‌కుమార్ లాంటి స్టార్ నటులు కీలక పాత్ర పోషిస్తుండగా 7Cs ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, కమర్షియల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సినిమాటోగ్రఫీకి కరన్ బహదూర్ రావత్ బాధ్యత వహించగా, మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ పాటల్ని కంపోజ్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు సమ్ సి.ఎస్. పని చేశారు. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్ చేతిలో ఉండగా, ఆర్ట్ డైరెక్షన్‌ను ఏ.కె. ముత్తు చూసుకున్నారు. మలేషియాలో పూర్తిగా చిత్రీకరించిన ఈ సినిమా టీజర్, పాటలు, గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది.

Also Read:బండెనక బండి కట్టి..BRS సభకు!

- Advertisement -