- Advertisement -
ఏసీబీ రైడ్స్..అంటేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. ఎవరైనా బాధితుడు ఏసీబీని ఆశ్రయిస్తే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని వారికి శిక్షలు వేస్తారు. అందుకే ఏసీబీ పేరు చెబితినే అవినీతి ఉద్యోగులు నిద్రకూడా పోరు.
తాజాగా ఓ తహసీల్దార్ అలాగే ఏసీబీకి భయపడి ఏకంగా రూ. 20 లక్షలు తగలబెట్టేశాడు. రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పర్వత్ సింగ్ పట్టుబట్టాడు. దీంతో ఏసీబీ తన ఇంట్లోకి రాక ముందే అన్ని డోర్లు మూసేసి తన దగ్గర ఉన్న నోట్లన్నింటినీ తహసీల్దార్ కల్పేష్ కుమార్ జైన్ తగులబెట్టేశాడు. అయితే రూ.1.5 లక్షలు దొరకడంతో ఆర్ఐ పర్వత్ సింగ్‌తోపాటు తహసీల్దార్ కల్పేష్ కుమార్‌లను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
- Advertisement -