ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి

566
acb
- Advertisement -

ఏసీబీ వలలో పట్టుబడ్డాడు అవినీతి అధికారి. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. వ్యాపారి మాదిరెడ్డి రాజిరెడ్డి అనే వ్యక్తి నుంచి ఆడిట్ రిపోర్టు కోసం 50 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు సరూర్ నగర్ ఏసీటీఓ(అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ అధికారి) సీహెచ్‌. శివ కుమార్.

దీంతో ఏసీబీని ఆశ్రయించారు రాజిరెడ్డి. బాధితుడి ఫిర్యాదుతో పక్కా ప్లాన్‌తో నాంపల్లి లోని డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ టాక్స్ కార్యాలయం లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

- Advertisement -