ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి.. దీంతో చాలమంది ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇక బయట ఎండల కారణంగా ఇంట్లో కూడా వేడి వాతావరణం ఉంటుంది. ఈ వేడి బారి నుంచి తప్పించుకోవడానికి, చల్లగా ఉండేందుకు ఇంట్లో కూలర్ లేదా ఏసీ వంటివి వాడేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. ఇక ఏసీ ఆఫీస్ లలో పని చ్సే వారైతే అసలు బయటకు రావడానికి కూడా ఏ మాత్రం ఇష్టపడరు. అయితే చల్లదనం కోసం ఏసీలో ఎక్కువసేపు ఉండడం కూడా మంచిది కాదట. ఏసీ రూమ్ లలో ఎక్కువ సేపు గడపడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also read: ఆధిక దాహం వేస్తోందా.. జాగ్రత్త !
ఏసీలో ఎక్కువసేపు గడిపి ఒక్కసారిగా ఎండలోకి రావడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఏసీ రూమ్ వాతావరణానికి బయటి వాతావరణానికి చాలా వ్యత్యాసం ఉండడంతో బయటకి వచ్చినప్పుడు చర్మం వెంటనే పొడిబారే అవకాశాలు ఎక్కువ. అలాగే డీహైడ్రేషన్ బారిన పడే ఛాన్స్ ఎక్కువగా ఉందట. ఇక ఏసీ రూమ్ లలో ఎక్కువ సేపు గడిపే వారికి గొంతు, కళ్ళు మరియు శ్వాసకోశ వ్యాధులు త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఏసీ గదులకు అలవాటు పడిన వారు ఎండలో ఎక్కువ సేపు ఉండడం వల్ల ముక్కు రంద్రాలు బిగుతుగా మారి రక్తస్రావనికి దారితీసే అవకాశం ఉంది. ఆస్తమా, అలెర్జీ వంటి వ్యాధులు ఉన్నవాళ్ళు కూడా ఏసీ రూమ్ లలో ఎక్కువ సేపు ఉండకూడదు. ఏసీ గదుల్లో ఎక్కువ సేపు గడిపి ఒక్కసారిగా బయటకు వస్తే కొందరికి తలనొప్పి, వాంతులు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అలాంటప్పుడు మైగ్రేన్ బారిన పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏసీ గదులకు వీలైనంతా దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Also read: Gold Price:లేటెస్ట్ ధరలివే