కన్నడ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రచితా రామ్ పుట్టినరోజు వేడుకల్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ‘డింపుల్ క్వీన్’గా అభిమానులు పిలుచుకునే రచితా రామ్ అక్టోబర్ 3న తన పుట్టినరోజు జరుపుకున్నారు. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా అభిమానులను కలుసుకుని వారితో కేక్ కట్ చేసి సందడి చేశారు.
అభిమానులతో సెల్ఫీలు దిగుతున్న సమయంలో ఓ వ్యక్తి రచితా రామ్ దగ్గరకు వచ్చాడు. తొలుత ఆమెతో ఫొటో దిగిన అతడు.. అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ వెంటనే అకస్మాత్తుగా రచితా రామ్ బుగ్గలను పట్టుకుని గిల్లి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ పరిణామం క్షణాల్లో జరగడంతో భద్రతా సిబ్బంది కూడా వెంటనే స్పందించలేకపోయారు.
అనుకోని చర్యతో రచితా రామ్ కాసేపు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేయకుండా వెంటనే తేరుకుని అభిమానులతో ఫొటోలు దిగుతూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అభిమానాన్ని చూపించే క్రమంలో సెలబ్రిటీల వ్యక్తిగత హద్దులను దాటకూడదని పలువురు సూచిస్తున్నారు. వారి అనుమతి లేకుండా తాకడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు.
Also Read:‘మరకతమణి 2’..షూటింగ్ పూర్తి
😄 Be honest, what kind of fan are you—playful 😜 or calm 😇?
Which one are you? 👀#RachitaRam pic.twitter.com/F3A16HFc9W
— Filmyyy__duniyaaa (@Filmyduniyaaa) October 3, 2026

