బాలీవుడ్‌లో కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే హీరోల్లో అభిషేక్ బచ్చన్ ముందువరుసలో ఉంటారు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ఆయన ప్రేక్షకులను మెప్పిస్తూ వుంటారు. అలాంటి అభిషేక్ బచ్చన్ తాజాగా తెలుగు సినిమాలను గురించి మాట్లాడారు. ఈ మధ్య కాలంలో కొంచెం బిజీగా ఉండటం వలన తెలుగు సినిమాలను ఎక్కువగా చూడటం లేదు గానీ, అంతకు ముందు బాగా చూసేవాడిని. ఏ మాత్రం కాస్త తీరిక దొరికినా ఏ తెలుగు సినిమాలు థియేటర్స్‌లో వున్నాయి .. ఏ సినిమాకి ఎలాంటి టాక్ వచ్చింది? అనేది తెలుసుకుంటూ ఉంటాను.
హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం అందుకు గల కారణాలేమిటనేది పరిశీలించడానికి ఆసక్తిని చూపుతాను. అంతేకాదు నాకు ప్రభాస్ ‘ఛత్రపతి’ సినిమా అంటే చాలా ఇష్టం. ఆ సినిమాలో అన్ని రకాల ఎలిమెంట్లూ సమపాళ్లలో ఉంటాయి. నాకు కనుక అవకాశం వస్తే ‘ఛత్రపతి’ హిందీ రీమేక్లో నటించాలని ఉంది.” అన్నాడు. ‘ఛత్రపతి’ సినిమా ఎవరికి నచ్చకుండా ఉంటుంది? ఇక స్మాల్ బీ తన మనసులో మాట బయటపెట్టాడు కాబట్టి ఆయనను ప్రభాస్ లాగా స్క్రీన్ పై ప్రెజెంట్ చేయగలిగే దర్శక ధీరులు తమ లక్కు ను ట్రై చేసుకోవచ్చన్నమాట.
Abhishek Bachchan wishes to remake Chatrapathi Movie