బాబాయ్‌ బర్త్‌ డేకు బన్నీ, చెర్రీ గిఫ్ట్..

263
Pawan Kalyan birthday

నేడు తమ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలను మెగా ఫ్యాన్స్ వైభవంగా జరుపుకుంటుండగా అల్లు అర్జున్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కి త‌న బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు శుభాభినందనలు చెప్పారు. చ‌ర‌ణ్‌కి త‌న బాబాయ్ అంటే ఎంత ఇష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే ఈ రోజు ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఓ స్వీట్ అండ్ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వ‌బోతున్న‌ట్టు నిన్న త‌న ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలియ‌జేశాడు. ప‌వ‌న్ ప్ర‌స్తుతం సినిమాలు చేయ‌డం లేదు కాబ‌ట్టి త‌న సినిమా టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసి మెగా ఫ్యాన్స్‌కి ప‌వ‌ర్ స్టార్ బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇస్తార‌ని అంద‌రు ఊహించారు.

Pawan Kalyan birthday

కాని అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ తాను ఓ వీడియోని పోస్ట్ చేశాడు. బాబాయ్ మీ ప్రేర‌ణ‌తోనే జీవితంలో, సినిమాల‌లో ధైర్యంగ‌ల విష‌యాలు చేశాను. మొద‌టి సారి మీ పుట్టిన రోజు సంద‌ర్భంగా మీ కోసం ఇలా చేయాల‌నిపించింది. ఇది మీకే అంకితం అంటూ పోస్ట్ పెట్టాడు చెర్రీ. ఇక అల్లు అర్జున్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ట్విట్టర్ ద్వారా విషెస్‌ చెప్పాడు. ఆ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ లగ్జరీ లైఫ్ ను వదిలేసి, సమాజం కోసం ఆయన పోరాడుతున్నారని బన్నీ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

Pawan Kalyan birthday

“పుట్టిన రోజు శుభాకాంక్షలు కళ్యాణ్ బాబాయ్. మీకు ఓ సౌకర్యవంతమైన లగ్జరీ లైఫ్ ఉన్నప్పటికీ, ఒక మంచి సమాజం కోసం పోరాటం చేస్తూ… మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలను నేను ఆరాధిస్తున్నాను. మీరు చేస్తున్న ఈ కృషి కొన్ని లక్షల హృదయాలను గెలుచుకుంది. వారందరి ప్రేమ, అపార శక్తి మీకు ఉంటుంది” అని అన్నాడు. వీరితోపాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు, హీరో, హీరోయిన్లు పవన్‌కు విషెస్‌ తెలిపారు.