సభలో కేసీఆర్‌ ప్రసంగం ఎంతసేపో తెలుసా..?

157
kcr speech

టీఆర్‌ ఎస్‌ ఆధ్వర్యంలో నేడు జరగబోయే ప్రగతి నివేదన సభకు తెలంగాణ ప్రజలు నలుమూలల నుంచి తరలివస్తున్నారు. ఇప్పటికే కొంగరకలాన్‌ వైపుగా వాహనాలు భారీ సంఖ్యలో వెళుతున్నాయి. అయితే మరో రెండు, మూడు, గంటల్లో ఈ భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది.

ఈ సభకు హాజరకానున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభలో సుమారు గంటన్నరపాటు ప్రసంగించే అవకాశాలున్నట్టు సమాచారం. కాగా.. ఈ రోజు ప్రగతీ భవన్‌లో రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. మరి కొద్ది సేపట్లో సీఎం సభాప్రాంగణానికి చేరుకోనున్నారు.

ఇక సభా వేదిక వద్దకు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కళాకారుల ఆటాపాటలు మొదలయ్యాయి. జై తెలంగాణ నినాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సభా ప్రాంగణం హోరెత్తుతుంది.