అభినందన్ వర్ధమాన్ ఈపేరు ఒక నెల రోజుల క్రితం భారత దేశం వ్యాప్తంగా మార్మోగింది. పాకిస్ధాన్ పై యుద్ద విమానాలతో దాడి చేసి అక్కడ వాళ్లకు చిక్కి క్షేమంగా భారత్ కు తిరిగి వచ్చిన భారత వాయు సేన వింగ్ కమాండర్ అభినందన్ బాగా ఫేమస్ అయ్యాడు. పాకిస్ధాన్ ఆర్మీ వాళ్ల చేతిలొ బందీ అయిన అభినందన్ ను చిత్ర హింసలు పెట్టిన సంగతి తెలిసిందే. గాయాలైన కారణంగా అభినందన్ కు అన్ని రకాల టెస్ట్ లు చేసిన వైద్యులు ఒక నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని కోరారు. ఈసందర్భంగా ఆయనను తన స్వగ్రామానికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని అధికారులు కోరారు.
కానీ ఆయన తమిళనాడులోని సొంతూరికి వెళ్ళడానికి నిరాకరించాడు. శ్రీనగర్లో ఉన్న ఎయిర్ బేస్కు వెళ్లి అక్కడ యుద్ధ విమానాల చెంత విశ్రాంతి తీసుకున్నాడు. నాలుగు వారాల తర్వాత అభినందన్ కు మరోసారి వైద్య పరీక్షలు చేస్తారు. ఏమాత్రం రెస్ట్ దొరికినా ఫ్యామిలీతో గడపాలనుకుంటారు జవాన్లు. కానీ అభినందర్ మాత్రం తన డ్యూటీ పట్ల ఉన్న మక్కువతో ఫ్యామీలితో కూడా గడపడం లేదు. నాలుగు వారాల తర్వాత అభినందన్ కు మరోసారి వైద్య పరీక్షలు చేస్తారు. ఈ టెస్టుల్లో అభినందన్ ఆరోగ్యం సరిగా ఉన్నదని తేలితేనే యుద్ద విమానాలను నడపాలా వద్దా అన్నది తెలియనుంది.