అభిజిత్ @ మెచ్యూర్డ్ మ్యాన్ ఆఫ్ ద హౌస్

57
abhijith

బిగ్ బాస్ తెలుగు 4 విజయవంతంగా 102 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 102వ ఎపిసోడ్‌లో భాగంగా ఇంట్లో ఉన్న సభ్యులను ఒక్కొక్కరిని పిలుస్తూ వారి జర్నీని చూపించారు బిగ్ బాస్. ఇందులో భాగంగా అభిజిత్‌ని మెచ్యూర్డ్ మ్యాన్ ఆఫ్ ద హౌస్‌ అనే టైటిల్ ఇచ్చారు.

నీ కంటే ఎక్కువ‌గా వేరేవాళ్ల‌కోసం ఆలోచించావ‌‌ని…ఇలాంటి ప‌రిప‌క్వ‌త చెందిన తెలివైన కంటెస్టెంటు హౌస్‌లో ఉన్నందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాన‌ని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో అభి చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తూ.. నేను బిగ్‌బాస్‌కు రావ‌డం అనేది నా జీవితంలోనే స‌రైన నిర్ణ‌యం అని భావిస్తున్నాను అని తెలిపాడు.

బిగ్ బాస్ హౌస్‌లో తన జర్నీని చూసి సంతోషాన్ని వ్యక్తం చేశాడు అభిజిత్. చివరగా తన జర్నీలో కొన్ని ఫోటోలను పెట్టగా అందులో తన ఫోటోని తీసుకుని లోపలికి వెళ్లిపోయాడు అభిజిత్.