ప్రభుత్వం సిగ్గుపడాలి: అభిజీత్

0
- Advertisement -

విద్యార్థి నిరసనకారుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై “ప్రభుత్వం సిగ్గుపడాలి” అని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే బుధవారం మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం హామీలు ఇచ్చినప్పటికీ విద్యార్థులపై చర్యలను కొనసాగిస్తే, మళ్లీ దేశవ్యాప్త ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. నీట్ యూజీ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ప్రభుత్వం మితిమీరిన బలప్రయోగానికి పాల్పడిందని ఆరోపించారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే CJP త్వరలోనే మళ్లీ వీధుల్లోకి వచ్చి పోరాడుతుందని స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడకూడదు. ఈ విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం, తమ హక్కుల కోసం నిరసన తెలిపారు. సరదా కోసం వారు ఈ పని చేయలేదు. జులై 20న వారు లాఠీఛార్జీలను ఎదుర్కొన్నారు. ఇంత రక్తం చిందించిన తర్వాత కూడా ప్రభుత్వ దురాశ తీరక, విద్యార్థులను ఇలాగే వేధిస్తూ ఉంటే.. మేము త్వరలోనే మళ్లీ వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తాము. విద్యార్థులను ఉగ్రవాదుల్లా భావిస్తూ వారిపై పెల్లెట్ తుపాకులు ఉపయోగిస్తారా? వారు సిగ్గుపడాలి! ఆ విద్యార్థులేమైనా ఉగ్రవాదులా? అమిత్ షా, నరేంద్ర మోదీలు దీనికి సిగ్గుపడాలి అని దీప్కే వ్యాఖ్యానించారు.

CJP మరొక ఆందోళనను ప్రారంభిస్తుందా అని ప్రశ్నించగా.. మేము చాలా త్వరలోనే చేస్తాం. ప్రభుత్వం ఒప్పుకోకపోతే, తన పద్ధతిని మార్చుకోకపోతే మేము ఆ పని చేయక తప్పదు అని ఆయన పునరుద్ఘాటించారు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆమె మాటలను అసలు ఎవరు తీవ్రంగా పరిగణిస్తారు? అని కొట్టిపారేశారు.

Also Read:విరాళాల చోరీ..SP ఎంపీల నిరసన

- Advertisement -