కాక్రోచెస్..బ్యాగ్‌లను ప్యాక్ చేసుకోండి!

1
- Advertisement -

అక్టోబర్ 10న దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు చేరుకోవాలని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే కోరారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 10న ప్రతి ఒక్కరూ తమ బ్యాగులను సిద్ధం చేసుకుని జంతర్ మంతర్‌కు రావాలని పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ వరకు జరిగే కార్యక్రమం ప్రశాంతమైన మార్చ్‌గా ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఈ కార్యక్రమానికి తరలిరావాలని కోరారు.

జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నట్లు అభిజీత్ దీప్కే తెలిపారు. అయితే ఈ కార్యక్రమం పూర్తిగా శాంతియుతంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి దాడులు, హింసకు తావు లేకుండా క్రమశిక్షణతో నిరసన కొనసాగించాలని సూచించారు.

“ధైర్యం అంటే దాడి చేయడం కాదు. ధైర్యం అంటే క్రమశిక్షణ, పట్టుదల” అని ఆయన పేర్కొన్నారు. నిరసనలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు.

Also Read:వైవా హర్ష ..లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద అందరం కలుద్దామని చెబుతూ.. తన బ్యాగ్ ఇప్పటికే సిద్ధంగా ఉందని, మిగతా వారు కూడా తమ బ్యాగులు తీసుకుని రావాలని అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు. శాంతియుతంగా జరిగే ఈ మార్చ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని ఆయన కోరారు.

- Advertisement -