BB10: శ్రిష్టి ఎలిమినేషన్..

3
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు ఇంట్లో నాలుగో వారం ముగిసింది. ‘టోటల్ డామినేషన్’ థీమ్‌తో సాగిన ఈ వారాంతపు ఎపిసోడ్‌లో శ్రిష్టి ఎలిమినేట్ అయింది. మరోవైపు ఝాన్సీ స్టార్ ప్లేయర్‌గా నిలిచింది. వచ్చే వారం ‘రోడ్ టు రీలోడ్’ అనే కొత్త థీమ్‌తో గేమ్ కొనసాగుతుందని నాగార్జున ప్రకటించారు.

సండే ఎపిసోడ్‌ను నాగార్జున సరదా టాస్కులతో ప్రారంభించారు. హీరో, హీరోయిన్లకు సంబంధించిన ప్రాపర్టీలను చూపిస్తూ సినిమా పేర్లు గెస్ చేసే టాస్క్‌ను కంటెస్టెంట్లతో ఆడించారు. ఈ క్రమంలో ముఖేష్, దేబ్జానీ, నరేష్, చరణ్, త్రిగుణ్ వరుసగా సేఫ్ అయినట్లు ప్రకటించారు. అనంతరం రెండు టీంల నుంచి కంటెస్టెంట్లు పాల్గొనే మరో టాస్క్ నిర్వహించారు. మెజార్టీ ఓట్ల ఆధారంగా ఝాన్సీని ఈ వారం స్టార్ ప్లేయర్‌గా ప్రకటించారు.

ఆ తర్వాత ఇంటి సభ్యులను ఐదు గ్రూపులుగా విభజించి, ప్రతి గ్రూపు నుంచి ఒకరిని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. పడవ టాస్క్‌లో ఎవరిని కాపాడతారు, ఎవరిని ముంచుతారు అని కెప్టెన్లను నాగ్ ప్రశ్నించారు. ఈ టాస్క్‌లో కంటెస్టెంట్లు తమకు నచ్చిన వారిని సేఫ్ చేస్తూ, మరొకరిని ఎలిమినేట్ చేసే నిర్ణయాలు చెప్పారు. అనంతరం రోహిత్, అమన్ సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించారు.

చివరగా శ్రిష్టి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆమె ఎలాంటి భావోద్వేగానికి లోనుకాకుండా నవ్వుతూ బయటకు వచ్చింది. అయితే తన జర్నీని చూసి మాత్రం ఎమోషనల్ అయింది.

బయటకు వచ్చిన తర్వాత శ్రిష్టి.. రాం ప్రసాద్, ముఖేష్, వర్షిణి ఇంకా మాస్కులు వేసుకుని గేమ్ ఆడుతున్నారని వ్యాఖ్యానించింది. ముఖ్యంగా రాం ప్రసాద్ తన మాటలతో ఇతరులను ప్రభావితం చేస్తున్నాడని చెప్పింది. దీనిపై నాగార్జున కూడా స్పందిస్తూ గతంలో మిథిలేష్ విషయంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైందని గుర్తుచేశారు.

Also Read:వైవా హర్ష ..లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

ఈ సమయంలో చరణ్ స్పందిస్తూ తమకు డబ్బుల కంటే బిగ్ బాస్ కప్పే ముఖ్యమని చెప్పాడు. వెంటనే నాగార్జున సరదాగా కౌంటర్ ఇస్తూ.. “నీకు ఆట కూడా ముఖ్యం కాదు కదా.. వారానికి ఒకసారి బయటకు వెళ్లి వస్తున్నావ్” అంటూ చరణ్‌పై సెటైర్ వేశారు. దీంతో స్టేజ్‌పై నవ్వులు పూశాయి.

- Advertisement -