ఐసీసీ టీ20 వరల్డ్ కప్ పై దృష్టిసారించింది దక్షిణాఫ్రికా మేనేజ్‌మెంట్. ఇందులో భాగంగా జట్టు కూర్పుపై దృష్టి సారించాడు హెడ్ కోచ్ మార్క్ బౌచర్. కోచ్‌గా నియమితులైన తర్వాత క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన డివిలియర్స్‌ను తిరిగి జట్టులోకి తీసుకురావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న బౌచర్ తాజాగా మరోసారి ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు.
ఏబీ ఫామ్‌లోకి వస్తే వరల్డ్ కప్ జట్టులోకి ఎంపిక చేస్తామని చెప్పాడు. అతని జాబ్‌కు న్యాయం చేయగలడని భావిస్తే అతన్ని టీ20 వరల్డ్‌కప్‌లో కొనసాగిస్తామన్నాడు. మంచి జట్టు ఉంటేనే వరల్డ్‌కప్‌ను సాధించే అవకాశాలుంటాయని చెప్పారు. ఏబీ ఫామ్‌లో లేకపోతే జట్టులో చోటు కష్టమేనని స్పష్టం చేశాడు.
2018లో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ తర్వాత దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు ఏబీ. అయితే గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో మళ్లీ జట్టు తరఫున ఆడటానికి డివిలియర్స్ ప్రయత్నాలు కూడా చేశాడు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా కోచ్ బౌచర్ సైతం ఏబీ ఎంట్రీపై స్పష్టమైన సంకేతాలిచ్చాడు.