బిబిసి ఏసియన్ నెట్ వర్క్ లో ‘ఆవు పులి మ‌ధ్య‌లో ప్రభాస్ పెళ్ళి’

295
online news portal
- Advertisement -

రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నటించిన ‘బాహుబ‌లి’ చిత్రంతో కాళ‌కేయ ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన వైవిధ్య‌మైన చిత్రం ‘ఆవు పులి మ‌ద్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి’.. ఈచిత్రాన్ని సూర్య‌దేవ ఫిల్మ్ కార్పోరేష‌న్ గుడి వంశిధ‌ర్ రెడ్డి, శైల‌జ స‌మ‌ర్పిస్తున్నారు. రెడ్ కార్పెట్ రీల్స్ బ్యాన‌ర్ లో నిర్మించిన ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని న‌వంబ‌ర్ 4 న ప్ర‌పంచ వ్యాప్తంగా విడ‌దల కానుంది. మెట్ట‌మెద‌టి సారిగా తెలుగు సాంగ్ బిబిసి ఏసియన్‌ నెట్ వర్క్‌లో ప్లే అవ్వ‌టం విశేషం.

ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు చైత‌న్య‌ మాట్లాడుతూ.. ఈచిత్రానికి మా టైటిల్ చాలా ప్ల‌స్ అయ్యింది. ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఫార్మెట్ లో కామెడి ఈ చిత్రంలో చూడోచ్చు.. స‌హ‌జంగా తెలుగు చిత్రాల్లో హీరో నో , హీరోయిన్ నో ప్రేమ వైఫ‌ల్యం చెంద‌టం తో క‌థ మెద‌లవుతాయి.. కానీ ఓ విల‌న్ ప్రేమ వైఫ‌ల్యాల మీద సాంగ్ చిత్రీక‌రించ‌టం తెలుగులో మెట్ట‌మెద‌టి సారి.. అలానే ఇప్పుడు ఈ సాంగ్ మెట్ట‌మెద‌టిసారిగా బిబిసి ఏసియన్‌ నెట్ వర్క్‌లో ప్లే అవటం ఆనందంగా ఉందన్నారు. ఇటీవలె విడుదలైన సినిమా టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు.

ఏ.ర‌వితేజ‌, అశ్వ‌ని, భాను, కాళ‌కేయ ప్ర‌భాక‌ర్‌, మ‌ధుమ‌ణి, జ‌బ‌ర్డ‌స్త్ వేణు, ప్ర‌భాక‌ర్, స‌మ‌ర్ప‌ణ‌- సూర్య‌దేవ ఫిల్మ్ కార్పోరేష‌న్ గుడి వంశిధ‌ర్ రెడ్డి మ‌రియు శ్రీమ‌తి శైల‌జ , బ్యాన‌ర్‌- రెడ్ కార్పెట్ రీల్స్ సంగీతం-ఎం.టి.క‌విశంక‌ర్‌, కెమెరా- ఆర్లి, స‌హ‌నిర్మాత‌లు- న‌గ‌రం సునిల్‌, మ‌ధుమణి నాయుడు, నిర్మాత‌- ర‌వి ప‌చ్చిపాల‌, ర‌చ‌న‌,ద‌ర్శ‌క‌త్వం – ఎస్‌.జె.చైత‌న్య

- Advertisement -