‘బియ్యం కుంభకోణం’పై ఆప్ నిరసన

0
- Advertisement -

ఢిల్లీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పిడిఎస్) కింద పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని ప్రైవేట్ సంస్థలకు అక్రమంగా విక్రయించారని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు బియ్యం బస్తాలతో నిరసన చేపట్టారు. పేదల బియ్యం ఎక్కడికి పోయాయి? అంటూ నినాదాలతో హోరెత్తించారు.

ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సభకు తీవ్ర అంతరాయం కలగడంతో స్పీకర్ ఆదేశాల మేరకు మార్షల్స్ ఎనిమిది మంది ఆప్ ఎమ్మెల్యేలను సభ నుండి బయటకు పంపించివేశారు.

ఆప్ నాయకులు చేస్తున్న ఆరోపణలను మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ఎలాంటి బియ్యాన్ని కొనలేదని, అమ్మలేదని స్పష్టం చేశారు. ఆప్ నేతలు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ రకమైన అసత్య ఆరోపణలు కొనసాగితే ఆప్ నేతలపై న్యాయపరమైన చర్యలు (కోర్టు ద్వారా డిఫమేషన్ దావా) తీసుకుంటానని మంత్రి హెచ్చరించారు.

Also Read:పెద్ద మనసుతో క్షమించండి:జానీ మాస్టర్

కాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆప్ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తోందని అధికార పక్షం ఆరోపించింది.

- Advertisement -