కోలీవుడ్ దంపతులు సూర్య-జ్యోతికల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివాహమై రెండు దశాబ్దాలు కాస్తున్నా వీరిద్దరి మధ్య అనురాగం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జ్యోతిక, తన భర్త సూర్యపై ప్రశంసల జల్లు కురిపించారు. సూర్య సంపూర్ణంగా ఒక ‘గ్రీన్ ఫ్లాగ్’ (మంచి గుణాలు కలిగిన భాగస్వామి) అని కొనియాడారు.
ఒక వ్యక్తిగా, భర్తగా, నటుడిగా సూర్య అద్భుతమైనవాడు…ఆయన ఆలోచనల్లో మైండ్ సెట్ ఎప్పుడూ ‘సమానత్వం’ ఉంటుంది. ఇది బయట నుంచి వచ్చేది కాదు, మనసు అంతరాళంలో ఉండే సహజ గుణం. ఇంట్లో మేమిద్దరం సమానం అని జ్యోతిక పేర్కొన్నారు.
నేను వంట చేస్తుంటే సూర్య కూడా కిచెన్‌లోకి వచ్చి నాతో పాటు వంట చేస్తాడు. పిల్లలను పెంచడం, సినిమాలు తీయడం, వెకేషన్లకు వెళ్లడం.. ప్రతీదీ ఇద్దరం కలసికట్టుగానే చేస్తాం. ఒకరి ఎదుగుదలను చూసి మరొకరం ఆనందిస్తామని జ్యోతిక వివరించారు.
జ్యోతిక వ్యాఖ్యలపై రిలేషన్‌షిప్ కోచ్ డెల్నా రాజేష్ స్పందిస్తూ.. బంధాల్లో “సమానత్వం” అంటే కేవలం ఎవరు సంపాదిస్తున్నారు లేదా ఎవరు వంట చేస్తున్నారు అనే బాహ్య విషయాలకే పరిమితం కాదని తెలిపారు.ఇద్దరు భాగస్వాములకు ఒకరి అభిప్రాయాలపై మరొకరికి సమాన గౌరవం ఉండటం.భార్యాభర్తలిద్దరి నిర్ణయాలకు బంధంలో సమాన ప్రాధాన్యత ఇవ్వడం. బాధ్యతలను కేవలం ఒక్కరిపైనే వేయకుండా, ప్రతీ పనిలోనూ ఒకరికొకరు తోడుగా నిలబడటం నిజమైన దాంపత్యానికి బలమైన పునాది అని నిపుణులు విశ్లేషించారు.
Also Read:పెద్ద మనసుతో క్షమించండి:జానీ మాస్టర్

