అమీర్ ఖాన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్ దేవసేన

398
aamiraward1
- Advertisement -

కేంద్ర సర్కార్ ప్రకటించిన స్వఛ్చ దర్పన్ అవార్డులలో పెద్దపల్లి జిల్లా దేశంలోనే మొదటి స్ధానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా నేడు ఢిల్లీలో స్వచ్చ దర్పన్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన పాల్గోన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛత అంశంపై నిర్వహించిన వర్క్ షాప్ లో కలెక్టర్ దేవసేన పాల్గొని..పెద్దపల్లి జిల్లాలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

అనంతరం పానీ సంస్థ (పాని పౌండేషన్) అధ్యక్షుడు, సినీ నటుడు అమీర్ ఖాన్, ఇతర కేంద్ర ఉన్నతాధికారుల సమక్షంలో కలెక్టర్ దేవసేన స్వచ్ఛ దర్పన్ అవార్డు స్వీకరించారు. జిల్లా ఇంచార్జి గ్రామీణ అభివృద్ధి అధికారి చంద్రప్రకాష్ రెడ్డి, స్వచ్ఛ భారత్ మిషన్ మేనేజర్ రాఘవులు, స్వశక్తి మహిళా సంఘాల ప్రత్యేక అధికారి ప్రేమ్ కుమార్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

- Advertisement -