ఆమీర్‌ఖాన్… బాక్సాఫీసు సంచలనం.‘తారే జమీన్ పర్’, ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’… ఇలా ఒకదాన్ని మించి హిట్ కొడుతు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు అమీర్. తాజాగా అమీర్ నటించిన చిత్రం ‘దంగల్’. తెలుగులో కూడా విడుదలకు సిద్ధమైంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన అమీర్…మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు.
తెలుగులో నా పాత్ర తెలుగులో మాట్లాడుతుంటే కొత్తగా అనిపించిందని అమీర్ ఖాన్ అన్నారు. సహ నటుల్ని ఎంపిక చేసే ఛాయిస్ ఉంటే చిరంజీవి, పవన్ కల్యాణ్‌ను ఎంచుకొంటానని తెలిపాడు. తమిళంలో రజనీకాంత్ అంటే చాలా ఇష్టమన్న పవన్…వీళ్లందరితో పనిచేయాలని ఉందని తెలిపాడు.
కొత్త భాషలు నేర్చుకోవడం ఇష్టమన్న అమీర్.. ‘పీకే’ కోసం భోజ్‌పురి నేర్చుకొన్నానని తెలిపాడు. ‘దంగల్’ కోసం హర్యాణీ భాషపై పట్టుసాధించానని….. ఒకవేళ తెలుగు సినిమాలో నటించాల్సివస్తే తప్పకుండా తెలుగు నేర్చుకొంటానని తెలిపాడు.
నేను రచయితని కాదు. నా కోసం రచయితలు, దర్శకులు మంచి పాత్రలు రాస్తున్నారు. ఈ విషయంలో వాళ్లకు రుణపడి ఉన్నా. నా వరకూ ఓ కథని సామాన్య ప్రేక్షకుడిలానే వింటా. నాలోని సగటు ప్రేక్షకుణ్ని ఆ కథ సంతృప్తిపరిస్తే చాలు. వెంటనే ఒప్పుకొంటా.నేనెప్పుడూ రికార్డుల గురించో.. వసూళ్ల కోసమో సినిమా తీయనని….. ప్రేక్షకుల హృదయాన్ని తాకితే చాలనుకొంటానని తెలిపాడు.
రాజమౌళి గొప్ప దర్శకుడని….. ఆయనతో పనిచేయాలని ఆశగా ఉందన్నారు. రాజమౌళి మహాభారత్ తీస్తే శ్రీకృష్ణుడి పాత్ర పోషిస్తానని తెలిపాడు. బరువు పెరగడానికి పెద్దగా కష్టపడలేదని… నాలుగైదు నెలల్లో 27 కిలోలు పెరిగా. మళ్లీ తగ్గడానికీ అంతే సమయం పట్టిందని తెలిపాడు. వారానికి ఒక పౌండ్ చొప్పున తగ్గితే మంచిది. కానీ నేను మాత్రం వారానికి నాలుగు పౌండ్లు తగ్గేవాణ్ని. అలా మూడు వారాలు చేశా. నిజానికి అలా ఉన్నఫళంగా తగ్గడం అంత శ్రేయస్కరం కాదు. అందుకే ఆ తర్వాత వేగం తగ్గించాను. లావుగా ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమయ్యేది. కనీసం వంగి షూ లేస్‌ని కూడా కట్టుకోలేకపోయేవాడినని తెలిపాడు.