టాలీవుడ్ బిగ్గెస్ట్ ఫ్లాప్స్ -2016

256
tollywood flop movies 2016
- Advertisement -

2016 సవంత్సరం.. తెలుగు సినిమా పరిశ్రమకు ఏమాత్రం కలిసిరాలేదు. నాగార్జున, నాని ఇలా కొందరు హీరోలు మినహా.. స్టార్ హీరోలంతా బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డారు. బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కల్యాణ్,మహేష్ బాబు లాంటి అగ్రహీరోలకు ఈ ఇయర్ ఏమాత్రం అచ్చిరాలేదు. భారీ అంచనాలతో వచ్చిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలు అంతే భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. బాలకృష్ణ 99 చిత్రం డిక్టేటర్ రిలీజ్ తో ఈ ఏడాది ప్రారంభమైంది. తొలిసారి బాలయ్య పక్కన త్రిష నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణం.. లౌక్యంతో హిట్ కొట్టిన శ్రీవాస్ దర్శకత్వం.. కలబోసి ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పాడ్డాయి. రచయితలు కోనవెంకట్, గోపీ మోహన్ ఈ సినిమా కోసం పనిచేశారు.అయితే అవుట్ డేటెట్ మేకింగ్ తో పాటు కథలో బలం లేకపోవడం డిక్టేటర్ డీలా పడ్డాడు.

ఇక ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లైన్లోకి వచ్చాడు. గబ్బర్ సింగ్ మూవీ ముందు వరకు పవన్ కల్యాణ్ కు10 సంవత్సరాల పాటు సరైన హిట్ లేదు. ఆ క్రమంలో గబ్బర్ సింగ్ మూవీ పవన్ ను హిట్ ట్రాక్ ఎక్కించింది, ఆ తరువాత వచ్చిన అత్తారింటికి దారేది మూవీ మంచి జోష్ ను ఇచ్చింది. అదే ఊపులో పవన్ హ్యాట్రిక్ కొడుతాడని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. అయితే ఈ ఏడాది ఓన్ బ్యానర్ లో పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ బాక్సాపీస్ వద్ద ఘోరపరాజయాన్ని చవిచూసింది.అయితే ఓపెనింగ్ కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి.

ఇక ఈ ఏడాది ఎన్నో అంచనాల మధ్య విడుదలై భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న చిత్రం.. బ్రహ్మోత్సవం. మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ అట్టర్ ప్లాప్ మూవీ. శ్రీకాంత్ అడ్డాల,మహేష్ బాబు కాంబినేషన్ పై భారీ అంచానాలున్నా.. విడుదలయ్యాక ప్రిన్స్ ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను బ్రహ్మోత్సవం ఘోరంగా నిరాశపరిచింది. శ్రీకాంత్ అడ్డాల ఈ మూవీని టీవీ సీరియల్ ను తలపించేలా తెరకెక్కించాడు. విడుదలైన కొద్దిరోజులకే బుల్లితెరపై ప్రీమియర్ షోగా ప్రసారమైన బ్రహ్మోత్సవం చిత్రాన్ని ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు. దీంతో ఈ చిత్రానికి అత్యల్ప టీఆర్పీ రేటింగ్స్ మాత్రమే వచ్చాయి.

ఇక ఆతరువాత చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన మనమంతా చిత్రం రిలీజైంది. చాలా ఏళ్ల తరువాత మలయాళీ సూపర్ స్టార్..మోహన్ లాల్ తెలుగులో చేసిన చిత్రం ఇది. అంచనాలతో వచ్చిన ఈ మూవీ మొదట పాజిటీవ్ టాక్ ను తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలు లభించాయి. అయితే పెద్ద బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ, లో ప్రమోషన్స్ కారణంగా ప్లాపుల జాబితాలో చేరింది.

ఇక ఆతరువాత చాలా కాలంగా కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న విక్టరీ వెంకటేష్ బాబు బంగారం మూవీతో ప్రేక్షకుల ముందుకు
వచ్చాడు. భలే భలే మొగాడివోయ్ మూవీ హిట్ తో, మంచి ఫామ్ లో ఉన్న దర్శకుడు మారుతి.. బాబు బంగారాన్ని తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్ రిలీజ్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. వింటేజ్ వెంకటేష్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కూడా ఈ మూవీపై ఆశలు పెట్టుకున్నారు. తీరా విడుదలయ్యక ప్రేక్షకుల అంచనాలు తారుమారయ్యాయి. బోరింగ్ సబ్జెక్ట్ తో ఆడియన్స్ సినిమా మధ్యలోనే బయటకు వెళ్లారు. గోపాల గోపాల మూవీ హిట్ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న వెంకీకి ఈ ఇయర్ అస్సలు కలిసిరాలేదు. బాబు బంగారం నిరాశనే మిగిల్చింది.

ఇక మెగా హీరో సాయిధరమ్ తేజ తనలోని తిక్కను చూపించడానికి వచ్చినా.. ప్రేక్షకులు తిరస్కరించారు. బ్యాక్ టు బ్యాక్ హిట్ల తరువాత ధరమ్ తేజ చేసిన తిక్క మూవీపై ఓ రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ రిలీజ్ తరువాత అంచనాలు మరింత పెరిగాయి. పైగా గత హిట్ల ను దృష్టిలో ఉంచుకుని సినిమాకు బడ్జెట్ కూడా భారీగానే పెట్టారు.కానీ, సాయిధరమ్ తేజ కెరియర్ లో తిక్క భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. రిలీజ్ రోజు నుంచే ప్రేక్షకుల నుంచి నెగటీవ్ టాక్ వినిపించింది. థియేటర్లు కూడా ఆడియన్స్ లేక ఖాళీగా దర్శనమిచ్చాయి. మొత్తానికి 2016 సంవత్సరం టాలీవుడ్ హీరోలకు భారీ పరాజాయాలనే మిగిల్చింది. మరీ, వచ్చే ఏడాది నుంచి అయినా..ఈ హీరోలు పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుంటారేమో చూడాలి.

- Advertisement -