బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘దంగల్ ‌’

220
- Advertisement -

బాలీవుడ్ అగ్రహీరో ఆమీర్ ఖాన్ దంగల్‌తో మరోసారి తన సత్తా నిరూపించుకున్నాడు. పీకే సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించిన మరోసారి దంగల్‌తో తన స్టామీనా చాటాడు. రిలీజ్కు ముందు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న దంగల్, రిలీజ్ తరువాత కూడా అదే హవా కంటిన్యూ చేసింది. భారత్‌లోనే కాదు ఓవర్సీస్‌లోనూ దుమ్ము దులుపుతోంది. నోట్ల రద్దుతో చిల్లర దొరక్క ఇబ్బందులు ఉన్న దంగల్‌పై ఆ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు.

ప్రముఖ ఇండియన్ రెజ్లర్ మహవీర్ సింగ్ పొగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమీర్ ఖాన్ నటన, కూతురి పాత్రలు పోషించిన ఫాతిమా, సాన్యా మల్హోత్ర నటనకు జనం నీరాజనం పట్టారు. కేవలం మూడు రోజుల్లోనే భారత్‌లో 100 కోట్లు కలెక‌్షన్లను రాబట్టింది. ఇండియా కంటే 2 రోజుల ముందే విదేశాల్లో విడుదలైన ఈ సినిమా ఓవర్సీస్ లో రికార్డు వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటివరకు అందిన లెక్కల ప్రకారం.. ఒక్క బుధవారం రోజే అమెరికా నుంచి దంగల్ సినిమా కేవలం తొలిరోజు 3 లక్షల 25వేల డాలర్లు ఆర్జించింది.

శుక్రవారం 29.78 కోట్లు, శనివారం 34.25 కోట్లు, ఆదివారం రూ.42.35 కోట్లు రాబట్టింది. ఓవరాల్గా శుక్ర, శని, ఆదివారాల్లో మూడు రోజులను కలుపుకొని కేవలం భారత్‌లోనే రూ. 106.95 కోట్ల వసూళ్లును కొల్లగొట్టిందని ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఆమిర్‌ ఖాన్‌ నటించిన చిత్రాల్లో అత్యుత్తమ చిత్రంగా ఇప్పటికే చాలా మంది విమర్శకులు, సెలబ్రిటీలు పొగడ్తలతో ముంచెత్తారు. సూపర్ హిట్ మౌత్ టాక్తో దూసుకుపోతున్న దంగల్ మరోసారి బాక్సాఫీస్ రికార్డ్లను తిరగరాయటం కాయంగా కనిపిస్తోంది.

Aamir Khan Dangal crosses the 100-crore mark

- Advertisement -