పందెం రాయుళ్లకు హైకోర్టు షాక్..

317
cockfighting
- Advertisement -

సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంద్ర ప్రాంతాల్లో నిర్వహించే కోడిపందాలకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. కోడి పందాల పేరుతో మద్యం, జూదం విచ్చలవిడిగా సాగుతుందని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పందాల పేరుతో మూగజీవాలను హింసించడం సరికాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇక నుంచి సంక్రాంతి పండుగకు కోడిపందాలు నిర్వహించేందుకు వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కోడి పందేలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కోడిపందాల నిర్వాహకులపై కఠినచర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. కోడిపందాల పేరుతో జంతువులను హిసిస్తున్నారని పేర్కొటూ.. పీపుల్‌ ఫర్‌ యనిమల్‌ ఆర్గనైజేషన్‌, యనిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు వేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది.

cockfighting

కోళ్ల పందాలను నిలిపివేయాలనే హైకోర్ట్ తాజా నిర్ణయంతో పందెం రాయుళ్ల ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది. సంక్రాంతి పండగకు కోస్తా ప్రాంతంలో ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతాయి. పందెం కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి బరిలోకి దింపుతారు. పందెం రాయుళ్లు కోట్లలో బెట్టింగులు పందెలు కాస్తుంటారు. పందేలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివస్తారు. సంకాంత్రికి కోస్తా జిల్లాల్లో కేవలం మూడు రోజుల్లోనే కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. అలాగే మద్యం కూడా భారీ ఎత్తున అమ్మడు పోతోంది. ఈ కోడి పందేలను నిషేధించాలని కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. వీటి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా పందెం రాయుళ్లు తమ పలుకుబడితో నిర్వహిస్తూనే ఉన్నాయి. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు కోడి పందేల నిర్వాహకులకు షాకిచ్చింది.

cockfighting

- Advertisement -