తక్షణమే చెల్లించాలి…చిక్కుల్లో ఆప్‌..!

227
Aam Aadmi Party Gets 27-Lakh Rent Notice From Its Own Government
- Advertisement -

ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ పార్టీ ప్రభుత్వమే నోటీసు ఇచ్చింది. ప్రభుత్వ భవనంలో నిర్వహిస్తున్న ఆప్ కార్యాలయానికి అద్దె చెల్లించడం లేదంటూ ఆప్ సర్కార్ నోటీసు పంపించింది. ప్రభుత్వ  భవనంలో నిర్వహిస్తున్న పార్టీ కార్యాలయానికి అద్దె చెల్లించాలంటూ పీడబ్ల్యూడీ శాఖ నోటీసులు పంపించింది.

తక్షణమే రూ.27 లక్షలు చెల్లించాలని, భవనాన్ని ఖాళీ చేయాలని ఆ  నోటీసులు పంపింది. దీంతో ఆప్‌కి సొంత ప్రభుత్వం నుంచే చిక్కులు ఎదురైనట్లైంది.

Aam Aadmi Party Gets 27-Lakh Rent Notice From Its Own Government

వెంటనే రూ. 27లక్షల అద్దె చెల్లించి భవనాన్ని ఖాళీ చేయాలని ఆమ్‌ఆద్మీ పార్టీకి పీడబ్యూడీ నోటీసులు జారీ చేసింది. భవనం లైసెన్సు ఫీజు కన్నా ఈ మొత్తం 65రెట్లు ఎక్కువ. అంతేగాక, అద్దె చెల్లించకపోతే.. దాన్ని మరింత పెంచుతామని అధికారులు స్పష్టం చేశారు.

ఈ విషయమై గత ఏప్రిల్‌లోనే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు నోటీసులు అందాయి.  అయితే నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీకి కార్యాలయానికి కేటాయించారని, వెంటనే ఖాళీ చేయాలని అప్పట్లో అధికారులు ఆదేశించారు. కాగా.. దిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ ఈ భవన కేటాయింపును రద్దు చేసినట్లు తెలుస్తోంది.

Aam Aadmi Party Gets 27-Lakh Rent Notice From Its Own Government

ఈ భవనాన్ని దిల్లీ మాజీ మంత్రి ఆసిమ్‌ అహ్మద్‌ఖాన్‌కు కేటాయించారు. అయితే అవినీతి ఆరోపణల కింద ఆయన పదవి నుంచి తొలగిపోవడంతో బంగ్లాను ఖాళీ చేశారు. అప్పటి నుంచి ఆ భవనాన్ని ఆప్‌ పార్టీ ఆఫీస్‌గా మార్చారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆప్‌కు భవనాన్ని కేటాయించారని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఆప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దర్యాప్తు చేసేందుకు దిల్లీ మాజీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. సదరు కమిటీ దర్యాప్తులో భవన కేటాయింపు విషయం వెలుగులోకి వచ్చింది.

Aam Aadmi Party Gets 27-Lakh Rent Notice From Its Own Government

దీంతో అధికారులు ఆప్‌కు నోటీసులు జారీ చేశారు. వెంటనే అద్దె చెల్లించి భవనాన్ని ఖాళీ చేయాలని స్పష్టం చేశారు. అయితే ఆప్‌ ప్రభుత్వం మాత్రం తాము న్యాయపరంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. అన్ని రాజకీయ పార్టీల లాగే.. తమ పార్టీ కార్యకలాపాల కోసం భవనాన్ని కేటాయించినట్లు చెబుతోంది.

- Advertisement -