యువ కథానాయకుడు ఆది సాయికుమార్ పుట్టినరోజు డిసెంబర్ 23. ఈ సందర్భంగా ఆది హీరోగా రూపొందుతోన్న కొత్త చిత్రం `శశి` ఫస్ట్ లుక్‌ను పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరికొత్త లుక్‌లో కనపడుతున్నారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి.వర్మ, రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చేతిలో మైక్‌తో కోపంగా ఉన్న ఆది ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది.
సురభి, రాశీసింగ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అరుణ్ చిలువేరు సంగీతాన్ని, అమర్‌నాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఒక షెడ్యూల్ చిత్రీకరణ మాత్రమే మిగిలిన ఉన్న ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను 2020 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.