జగ్గారెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు

403
chinta Prabhakar Jaggareddy

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. ఇటివలే జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మంత్రి హరీశ్ రావును సంగారెడ్డిలో అడుగుపెట్టనివ్వను అని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై నేడు సంగారెడ్డిలో ప్రెస్ మీట్ నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. ఎంపీ ప్రభాకర్ రెడ్డి, మంత్రి హరీశ్ రావును విమర్శించే అర్హత జగ్గారెడ్డికి లేదన్నారు.

జగ్గారెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు మభ్యపెట్టి గెలిచావన్నారు. తాను గెలవకపోతే చచ్చిపోతానని జగ్గారెడ్డి ప్రజల ముందు ఎడ్చినట్లు గుర్తుచేశారు. ఎన్నికల్లో చెప్పిన ఒక్క హామీ ని జగ్గారెడ్డి నెరవేర్చలేదన్నారు. జగ్గారెడ్డి లాంటి నీచమైన చరిత్రకలిగిన ఎమ్మెల్యే ఎక్కడా లేరన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలో మరొకసారి ప్రజలను మోసం చేయడానికే పనికిరాని ప్రకటనలు చేస్తున్నారన్నారు.