విక్రమ్ సెన్సార్ పూర్తి!

77
vikran
- Advertisement -

స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొనగా తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్‌ను సైతం పూర్తి చేసుకుంది.

ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. చాలా రోజుల తరువాత కమల్ నుండి పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నామని సెన్సార్ బోర్డు సభ్యులు ప్రశంసలు గుప్పించారట. సినిమా రన్‌టైమ్ 153 నిమిషాలకు లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. జూన్ 3వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండగా, ఈ సినిమాను చూసేందుకు తాము ఎంత ఉత్సాహంగా ఉన్నారో అభిమానులు ఇప్పటికే బుక్‌మై‌షో పోర్టల్‌లో రికార్డు స్థాయిలో తెలుపుతున్నారు.

అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ భారీ బడ్జెత్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. కమల్‌తో పాటు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, మలయాళ యాక్టర్ ఫహాద్ ఫజిల్ కూడా నటిస్తుండటంతో సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయింది.

- Advertisement -