హీరో రామ్‌ను ఢీ కొట్టనున్న ఆది పినిశెట్టి..!

124
Ram Pothineni

కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి రామ్ హీరోగా ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే సెట్స్ మీదకి వచ్చిన ఈ మూవీ షెడ్యూల్స్ హైదరాబాద్, వైజాగ్‌లో ప్లాన్ చేశారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో మరో యువ నటుడు ఆది పినిశెట్టిని కీలక పాత్రకి తీసుకున్నాట్లు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించింది.

ఇందులో విలన్ పాత్రలో ఆది పినిశెట్టి కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఆయన కూడా షూటింగ్‌లో జాయిన్ కానున్నట్టు సమాచారం. టాలీవుడ్‌లో ఆదిపినిశెట్టికి మంచి క్రేజ్ ఉంది. హీరోగా నటిస్తూనే విలన్ పాత్రలలోనూ, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మంచి పాత్రలు పోషిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా వచ్చిన రామ్ 19 తనకి మరింత పేరు తీసుకువస్తుందని భావిస్తున్నాడు. ఈమూవీలో రామ్‌ సరసన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. రాక్‌స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.