డెడ్‌ లైన్‌.. ఆగస్టు 31 వరకే..

203
Aadhaar card link with PAN card last date extended till August 31 ...
- Advertisement -

ఆదాయపన్ను చట్టానికి సవరణ చేయడంతో ఆధార్‌తో పాన్‌కార్డ్‌ అనుసంధానం తప్పనిసరి అయింది. అందుకు తుది గడువు ఆగస్టు 31 వరకే ఉంది. ఈ పనిని ఆన్‌లైన్‌లోనే సులభంగా చేసుకోవచ్చని యూఐడీఏఐ ప్రకటించింది.

* మొదట ఇన్‌కమ్‌ టాక్స్‌ ఈ-పోర్టల్‌లో రిజిస్టర్‌ కావాలి.
* లాగిన్‌ ఐడీ, పాస్వర్డ్‌, పుట్టిన తేదీ ఉపయోగించి ఈ-పోర్టల్‌లో లాగిన్‌ అవ్వాలి.
* లాగిన్‌ కాగానే ఒక పాపప్‌ విండో ఓపెన్‌ అవుతుంది. అక్కడ ఆధార్‌ కార్డ్‌ లింక్‌ చేసే ఆప్షన్‌ వస్తుంది. ఒకవేళ అలా రాకుంటే ప్రొఫైల్‌ సెట్టింగ్స్‌ని క్లిక్‌        చేసి లింక్‌ ఆధార్‌ అనే బటన్‌ను నొక్కాలి.
* అక్కడ వ్యక్తిగత వివరాలు, పేరు, పుట్టిన తేదీ, లింగం తదితర వివరాలు సరిచూసుకోవాలి. అక్కడ ఆధార్‌ నంబర్‌ ఇవ్వాల్సి ఉంటుంది.
తర్వాత వచ్చిన ఆధార్‌ వివరాలు, పాన్‌ వివరాలతో సరిచూసుకోవాలి.
* అన్ని సరిపోయిన తరువాత ‘లింక్‌ ఆధార్‌’ అనే ఆప్షన్‌ని క్లిక్‌ చేయాలి. ఒక వేళ వివరాలు సరిపోలకపోతే విడిగా వాటి సమాచారం అప్‌డేట్‌            చేసుకోవాలి
* అన్ని సరిపోయి ఆధార్‌తో అనుసంధం పూర్తైతే ఆధార్‌తో పాన్‌ విజయవంతంగా లింక్‌ అయిందన్న పాపప్‌ సందేశం వస్తుంది.

- Advertisement -