ఆ మాట సాయమే మోదీని కాపాడింది..

18
- Advertisement -

మహారాష్ట్రలో బీజేపీ శివసేనల మధ్య పోరు ముదిరిపోతుంది. తాజాగా ప్రధాని మోదీని ఉద్దేశించి మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బాల్‌ఠాక్రే మోదీని కాపాడకపోయి ఉంటే ఇప్పుడు మోదీ ఉండేవారు కాదని అన్నారు. రానున్న రోజుల్లో ముంబైకి జరిగే బీఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ…నేను బీజేపీతో బంధం తెంచుకున్నాను. కానీ హిందూత్వంతో కాదన్నారు. బీజేపీ అనుసరించేది హిందూత్వ విధానం కాదన్నారు. ఉత్తరభారతీయులు హిందూత్వమంటే ఎమిటో అడుగుతున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. బీజేపీ హిందూవుల మధ్య చీలకను సృష్టిస్తోంది. మతంతో సంబంధం లేకుండా భారత్‌ను ద్వేషించేవారికే బాలా సాహెబ్ వ్యతిరేకం అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోదీకి బాల్‌ఠాక్రే చేసిన మాట సాయాన్ని గుర్తు చేశారు.

మాజీ ప్రధాని అటల్‌జీ రాజధర్మాన్ని గౌరవించాలని భావించిన సమయంలో..ప్రధాని మోదీని కాపాడింది మాత్రం బాల్‌ఠాక్రే అని అన్నారు. ఆ రోజు ఆయన ఆ సాయం చేయకపోతే.. మోదీ ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవారు కాదని అన్నారు. 2002గుజరాత్ అల్లర్ల తర్వాత రాజధర్మాన్ని పాటించాలని మోదీకి వాజ్‌పేయీ చేసిన సూచనను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి…

ఘర్ వాపసే..సొంత గూటికి ఈటల?

జగన్ పరిపాలనపై..ప్రజా డెసిషన్?

మోడీ పాలనలో.. దేశం నాశనం !

- Advertisement -