హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి కన్నడ ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ వార్త ఇప్పుడు తెగ వినిపిస్తోంది. ప్రణీత సుభాష్ గర్భవతి అని మళ్ళీ పుకార్లు పుట్టించారు. ఇప్పటికే, ప్రణీత సుభాష్ తల్లి అయిన సంగతి తెలిసిందే. ఓ పండంటి పాపకు ఆమె జన్మనిచ్చింది. తన ముద్దుల కూతురికి ‘ఆర్న’ అని పేరు కూడా పెట్టుకుంది. ఐతే, తాజాగా ప్రణీత మళ్లీ తల్లి కాబోతుంది అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది.
మరి ఈ పుకార్లలో నిజం ఉందా అని ఆరా తీస్తే.. ప్రనీత సుభాష్ మాత్రం మళ్లీ తల్లి కావాలనే ఆలోచనలో లేదట. పైగా ప్రణీత సుభాష్ త్వరలో డిజిటల్ లోకి కూడా ఎంటర్ కానుంది. చిన్న చిన్న చిత్రాలను నిర్మించే ఆలోచనలో ఆమె ఉంది. కథల ఎంపిక దగ్గర నుంచి నిర్మాణం వరకు అన్నీ ప్రణీత సుభాషే చూసుకుంటుందని తెలుస్తోంది. నటిగా ఎంతో పాపులారిటీ సాధించిన ప్రణీత సుభాష్, మరి నిర్మాతగా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
ప్రణీత సుభాష్ కు సోషల్ మీడియాలోనూ బోలెడు మంది అభిమానులు ఉన్నారు, అందుకే ప్రణీత సుభాష్ అప్ డేట్స్ కోసం కూడా ప్రత్యేకంగా వారంతా ఎదురుచూస్తుంటారు. ఏది ఏమైనా ప్రణీత సుభాష్ ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తోంది. అన్నట్టు ఆమె హీరోయిన్ గా ప్రస్తుతం ఓ మలయాళ సినిమా కూడా చేస్తోంది.
ఇవి కూడా చదవండి…