లక్ అంటే ఇదేనేమో?

203
A Woman Got Injured After Two Cars Collides In Delhi
- Advertisement -

ఢిల్లీలో కారు యాక్సిడెంట్ చేసి ఓ వ్య‌క్తి మ‌ర‌ణానికి కార‌ణ‌మైన మైన‌రు కుర్రాడి ఉదంతం మ‌ర్చిపోక‌ముందే మరో మైనర్ కుర్రాడి దాష్టికం వెలుగులోకి వచ్చింది. మైనర్ కుర్రాడి రాష్ డ్రైవింగ్‌తో  ఓ మహిళ తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైంది. సీసీ కెమెరా ద్వారా బయటకు వచ్చిన ఈ దృశ్యం అందరిని షాక్ కు గురిచేస్తోంది.

వివరాల్లోకి వెళితే…న్యూ ఇయర్ సందర్భంగా ఓ అపార్ట్ మెంట్‌ నుంచి బయటకు వచ్చిన మహిళ…ఆటోకోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో అపార్ట్‌మెంట్స్‌ నుంచి వచ్చిన వాగన్‌ ఆర్‌ కారు ఆమెకు చేరువలో రోడ్డు దాటేందుకు సిద్ధంగా ఉంది. ఇంతలో రోడ్డు అవతలివైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ ఎర్టిగా కారు.. అదుపు తప్పి మొదట మహిళను, ఆ వెంటనే వాగన్‌ ఆర్‌ను ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో రెండు వాహనాల మధ్య నలిగి తీవ్రంగా గాయపడ్డ మహిళ.. కారు కింద ఇరుక్కుపోయింది. స్థానికులు అతికష్టం మీద ఆమెను బయటకు తీశారు. కాగా, ఈ ప్రమాదానికి కారణమైంది ఓ మైనర్. ప్రమాదం జరిగిన తర్వాత అతను పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ మహిళను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. లక్ ఉండాలే కాని చావునైనా జయించొచ్చు అంటారు. ఈ భూమ్మీద ఇంకా నూకలు మిగిలి ఉండాలే కాని.. ఎంత ఘోర ప్రమాదం నుంచైనా ప్రాణాలతో బయటపడొచ్చనటానికి ఇదే ఉదాహరణ.

- Advertisement -