మానవత్వం మరిచిన మనుషులు.. కరుణించిన మృత్యువు..

336
pamuru
- Advertisement -

వెంకయ్య,వెంకటలక్ష్మి దంపతులది ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం సీఎస్‌పురం మండలం పెదరాజుపాలెం. వీరికి సురేష్‌ అనే కుమారుడు ఉన్నాడు. వీరు కొంతకాలంగా పామూరు అద్దె ఇంట్లో నివాసిస్తున్నారు. అయితే నాలుగు నెలల క్రితం వెంకటలక్ష్మికి ప్రాణాంతక క్యాన్సర్‌ సోకింది. సురేష్‌ ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించాడు. చాలా డబ్బు ఖర్చు చేశారు. కానీ జబ్బు నయం కాలేదు. ఇక చేసేదేమిలేక సురేష్ తల్లిని ఇంటి తీసుకెళ్లాడు. వెంకటలక్ష్మి ఆరోగ్యం క్షీణించటంతో అద్దె ఇంటి ఓనర్ ఆమెను ఇంట్లో ఉంచొద్దని చెప్పాడు.

ఇలాంటి సురేష్‌కు స్నేహితులు కూడా సహాయం చేయక పోవటంతో చావు బ్రతుకుల మధ్య ఉన్న తన తల్లిని తీసుకొని చెరువు దగ్గర ఉండే పార్కు వద్ద టెంట్ వేసి అక్కడ పడుకో బెట్టి ఏమిచెయ్యలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇది తెలుసుకున్న ఉన్నతధికారులు అమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స అందించాలని స్థానికి వైద్య అధికారులను ఆదేశించారు. వెంటనే ఆసుపత్రిలో చేర్చుకున్నారు. కానీ వెంకటలక్ష్మి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ లోకంలో మనుషులు మానవత్వం మరిచారని తెలుసుకున్న మృత్యువు ఆ తల్లిని కరుణించి తన ఒడిలో చేర్చుకుంది.

ఇదంతా కళ్లముందే జరగడంతో సురేష్‌ ఎంతో ఆవేదనకు గురైయ్యాడు. అయితే అతని ఆవేదన ఒక్కటే, పామూరులో 50 శాతం మంది అద్దె ఇంట్లో ఉంటున్నారు, ఈరోజు నాకు, రేపు మరికొందరికి ఈ సమస్య వస్తూనే ఉంటుంది. కాబట్టి అధికారులు, నాయకులు స్పందించి ఇటువంటి పరిస్థితి నుండి బయట పడటానికి ఒక రూమ్ వసతిని ఏర్పాటు చేస్తే ఇలా అన్ని ఉన్న అనాధ లాగ ఉండాల్సిన అవసరం లేదంటు తన ఆవేదన వ్యక్తం చేశాడు. మరి సురేష్‌ అవేదనను అధికారులు కానీ.. ప్రజాప్రతినిధులు కానీ అర్థం చేసుకొని తగిన చర్యలు తీసుకుంటారో చూడాలి.

A Very Sad Incident in Prakasam district..A Very Sad Incident in Prakasam district..A Very Sad Incident in Prakasam district..

- Advertisement -