ప్రభుత్వం బతుకమ్మకు ఎంతో ప్రాముఖ్యత కల్పిస్తోంది..

207
k kavitha

రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ యూనిట్ ఆధ్వర్యంలో బతుకమ్మ స్టేట్ లెవల్ ఫోటో కాంటెస్ట్ -2019 అవార్డ్ ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై.. అవార్డులు అందించారు.

జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ..బతుకమ్మను ప్రతిబింబించేలా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం సంతోషకరం. ఈ సారి నాన్ జర్నలిస్టులకు అవకాశం ఇవ్వడం మంచి పరిణామం. ప్రతి ఫోటో జర్నలిస్ట్‌పై ఎంతో సామాజిక భాధ్యత ఉంది. ప్రభుత్వం బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాముఖ్యత కల్పిస్తోంది అని కవిత అన్నారు.

Batukamma State Level Photo Contest-2019 Awards Ceremony was held under the aegis of the Telangana State Photo Journalist Association..