తొలి మ్యాచ్‌లో భారత్‌తో ఓటమి పాలుకావడం తమలో కసిపెంచిందని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ తెలిపాడు. ఛాంపియ్న్ ట్రోఫిలో ఎవరు ఉహించని విధంగా ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి పాక్ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సర్ఫరాజ్ మిండియాతో ఓటమిపాలు కావడంతో ప్రతి మ్యాచ్ లో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపాడు. అందుకు కసిగా ప్రణాళికకు తగ్గట్టు ఆడామని అన్నాడు.
భారత్‌తో ఓటమి అనంతరం మాకు మద్దతుగా నిలిచిన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన పాక్ కెప్టెన్ సెమీఫైనల్లో విజయం బౌలర్ల వల్లే దక్కిందని స్పష్టం చేశాడు. మా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారని చెప్పుకొచ్చాడు. అమిర్ స్థానంలో జట్టులోకి రయీస్ ని తీసుకోవడంతో అతను తమ నమ్మకాన్ని నిలబెట్టాడని చెప్పాడు. జట్టుపై మేనేజ్ మెంట్ ఎలాంటి ఒత్తిడి తీసుకురకపోవడంతో తమలో పట్టుదల పెరిగిందని అన్నాడు. హాసన్ అలీ సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడని ఫైనల్లో కూడా ఇలాంటి ప్రదర్శనే కొనసాగిస్తాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ గురించి స్పందిస్తూ.. ఇరు జట్లు అద్భుతంగా ఆడతాయి. ఫైనల్లో ఎవర్ని ఎదుర్కోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఫైనల్లోనూ హాసన్ అలీ ఇలాంటి ప్రదర్శనే కొనసాగిస్తాడని సర్ఫరాజ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.