కూతురి కోసం బాలయ్య సినిమాలు

24
- Advertisement -

నటసింహం బాలయ్య బాబు రెండో కూతురు తేజ‌స్విని.. నిర్మాణ సంస్థ‌ని స్థాపించాలని అనుకుంటున్నట్లు సంగ‌తి తెలిసిందే. తన బ్యాన‌ర్‌లో బాలయ్య బాబుతో ఓ సినిమా చేస్తార‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. కానీ అదీ ప‌ట్టాలెక్క‌లేదు. ఇప్పుడు త‌న కూతురి కోసం ఓ సినిమా చేయ‌డానికి బాలయ్య ఫిక్స్ అయ్యారు. బాలయ్య కోసం దర్శకుడు బాబీ ఓ క‌థ సిద్ధం చేశాడ‌ని, ఈ చిత్రాన్ని బాలయ్య రెండో కూతురు తేజ‌స్విని నిర్మించబోతుందని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. బాలయ్య కూడా కథ విన్నారు. తేజ‌స్వినికి కూడా ఈ కథ చాలా బాగా నచ్చిందట. అందుకే ఈసారి తన కూతురి బ్యాన‌ర్‌లో కచ్చితంగా సినిమా చేయాల‌ని బాలయ్య నిర్ణయించుకున్నాడు. నిజానికి బింబిసార ద‌ర్శ‌కుడు వ‌శిష్ట‌తోనూ బాలయ్య బాబు ఓ సినిమా ఒప్పుకుంటున్నారని టాక్ నడిచింది.

Also Read: శ్రీలీల కి మరో క్రేజీ ఆఫర్

ఐతే, బింబిసార ద‌ర్శ‌కుడు వ‌శిష్ట‌తో బాలయ్య చేసే సినిమాని కూడా తేజ‌స్విని నే నిర్మించనున్నారు. ఆమె తన రెండో సినిమాగా ఈ చిత్రాన్ని తీసుకురానున్నారు. అన్నట్టు ఆగ‌స్టు నుంచి దర్శకుడు బాబీ సినిమా ప‌ట్టాలెక్కే ఛాన్స్ ఉంది. దీంతో పాటే స‌మాంత‌రంగా వ‌శిష్ట‌ సినిమా మొద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాలతో తేజ‌స్విని ఏ స్థాయిలో విజయాలు సాధిస్తోందో చూడాలి.

Also Read: తలైవా రిటైర్‌ అవుతారా..!

- Advertisement -